డ్రై ఫ్రూట్స్ అనేవి రోజూ మనం తినడం వలన మనకు ఆరోగ్యపరంగా ఎంతో మంచివి. వాటిలో బాదం పప్పులు, జీడి పప్పులు, పిస్తా.. ఇలా అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా అంజూర తినడం వలన అనేకరకమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.
అంజూరలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
అంజూర తినడం వలన మలబద్దకం వంటివి రాకుండా ఉండేలా చేస్తుంది.
అంజూరలో ఎక్కువగా ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలు గట్టిగా ఉండేలా చేస్తాయి.
అంజూరలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు కాన్సర్ ని తగ్గించడానికి సహకరిస్తాయి.
అంజూర తినడం వలన మన శరీరంలో రక్తపోటు నియంత్రణలో ఉండేటట్లు చేస్తుంది.
అంజూర తినడం వలన రక్తనాళాలలో ఏర్పడిన ఫ్రీరాడికల్స్ తొలగించడానికి సహాయపడుతుంది.
అంజూర తినడం వలన గుండెపోటు వంటివి రాకుండా ఉండేలా చేస్తుంది.
అంజూరను పొడి చేసుకొని పాలల్లో కలుపుకొని తాగడం వలన ఎక్కువ పోషకాలు మన శరీరానికి అంది వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు వంటివి కూడా తగ్గుతాయి.
అంజూరలో ఉండే విటమిన్ బి గర్భిణులు ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.
చర్మ సమస్యలు ఉన్నప్పుడు అంజూర తినడం వలన తగ్గుతాయి.