పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న RRR మూవీ..

ఇటీవల HCA (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) అవార్డ్స్‌లో 5 అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ అవార్డ్స్‌కి ఎన్టీఆర్, తారకరత్న మరణం వల్ల వెళ్లలేకపోయాడు.

దీంతో ఎన్టీఆర్‌కి వచ్చిన అవార్డుని వచ్చే వారం ఇండియా పంపించబోతున్నాము అంటూ HCA ట్వీట్ చేసింది.

ఇక ఈ ట్వీట్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఎన్టీఆర్‌తో పాటు హీరోయిన్‌గా నటించిన అలియాకు కూడా అవార్డుని పంపిస్తున్నారు.

కాగా RRR మూవీ ఆస్కార్ రేస్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 12న జరిగే ఈ అవార్డుల వేడుకల్లో..

సింగర్స్ రాహుల్ సిప్లిగుంజ్, కల భైరవ 'నాటు నాటు' సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు.