అడివి శేషు ఈ ఏడాది నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి.

ఇప్పుడు తన తదుపరి సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు.

ఈ క్రమంలోనే గూఢచారి-2 గురించి ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.

అడివి శేషుకి స్టార్ హీరో ఇమేజ్‌ని తెచ్చిపెట్టిన సినిమా 'గూఢచారి'.

2018‌లో విడుదలైన 'గూఢచారి' అందర్నీ ఎంతగానో అక్కట్టుకోవడంతో.. ఈ మూవీ సీక్వెల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఆడియన్స్.

తాజాగా న్యూ ఇయర్‌కి ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేశాడు అడివి శేషు.

జనవరి 9న మూవీకి సంబంధించిన 'ప్రీ విజన్ వీడియో'ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు

ఈ వీడియో లాంచ్ ఈవెంట్‌ని ముంబై అండ్ ఢిల్లీలో నిర్వహించనున్నట్లు తెలియజేశాడు.