రవితేజ ప్రస్తుతం 'రావణాసుర' సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు.
తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.
ఈ ఈవెంట్‌కి హాజరయ్యిన గోపీచంద్ మలినేని క్రాక్ 2 పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన క్రాక్ సూపర్ హిట్ అయ్యింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. క్రాక్ 2 ప్రాజెక్ట్ ఉంది.
దానిని త్వరలోనే మీ ముందుకు తీసుకోని వస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.
వీరిద్దరి కలయికలో ఇప్పటి వరకు డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి.
దీంతో ఇప్పుడు క్రాక్ 2 గురించి చేసిన వ్యాఖ్యలు.. రవితేజ అభిమానులను ఖుషీ చేస్తుంది.