గోపీచంద్ ప్రస్తుతం తన ల్యాండ్ మార్క్ మూవీ 30వ సినిమా తెరకెక్కిస్తున్నాడు.

'రామబాణం' అనే టైటిల్‌ని పెట్టుకున్న ఈ సినిమాని శ్రీవాస్‌ డైరెక్ట్ చేస్తున్నాడు.

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన  ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సూపర్ హిట్టుగా నిలిచాయి.

తాజాగా తన 31వ సినిమాని పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ చేశాడు గోపీచంద్. 

ఈ సినిమాని కన్నడ స్టార్ డైరెక్ట్ ఏ.హర్ష తెరకెక్కించబోతున్నాడు.

కన్నడలో వేద, వజ్రకాయ, బజరంగీ వంటి మాస్ హిట్స్ ఇచ్చాడు హర్ష.

కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు.

ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానున్నట్లు తెలియజేశారు.