టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీల్లో ఒకటి NTR30.

RRR వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. ఈ మూవీ పై పాన్ ఇండియా వైడ్ ఆసక్తి నెలకుంది.

గత ఏడాదిలోనే అనౌన్స్ చేసిన సినిమా.. క్రిందటి నెలలో మొదలు కావాల్సి ఉంది.

కానీ తారకరత్న మరణం వలన పోస్ట్‌పోన్ అయ్యింది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటించబోతుంది అంటూ చాలా కాలం నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా నేడు ఈ వార్తలు నిజం చేస్తూ, నేడు జాన్వీ పుట్టినరోజు సందర్భంగా..

జాన్వీని NTR30 ప్రాజెక్ట్‌లోకి వెల్కమ్ చెబుతూ తనే హీరోయిన్ అని అధికారికంగా తెలియజేశారు.

అంతేకాదు మూవీలోని జాన్వీ లుక్‌ని కూడా రివీల్ చేశారు.