ఫిఫా వరల్డ్ కప్ లో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయో తెలుసా??

ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ 2022 ఖతార్ లో గ్రాండ్ గా జరుగుతుంది.

ఫిఫాలో పాల్గొంటున్న దేశాల నుంచి అభిమానులు వచ్చి ఖతార్ లో సందడి చేస్తున్నారు.

ఈ సారి ఫిఫాలో 8 గ్రూపులుగా 32 దేశాలు పాల్గొంటున్నాయి.

గ్రూప్ A లో నెదర్లాండ్స్, సెనెగల్, ఈక్వడార్, ఖతార్ దేశాలు ఉన్నాయి.

గ్రూప్ B లో ఇంగ్లాండ్, అమెరికా, ఇరాన్, వేల్స్ దేశాలు ఉన్నాయి.

గ్రూప్ C లో అర్జెంటీనా, పోలాండ్, మెక్సికో, సౌదీ అరేబియా ఉన్నాయి.

గ్రూప్ D లో ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ట్యునీషియా, డెన్మార్క్ ఉన్నాయి.

గ్రూప్ E లో స్పెయిన్, జపాన్, కోస్టారికా, జర్మనీ ఉన్నాయి.

గ్రూప్ F లో క్రోషియా, మొరాకో, బెల్జియం, కెనడా ఉన్నాయి.

గ్రూప్ G లో బ్రెజిల్, స్విట్జర్లాండ్, కెమరూన్, సెర్బియా ఉన్నాయి.

గ్రూప్ H లో పోర్చుగల్, సౌత్ కొరియా, ఘానా, ఉరుగ్వే ఉన్నాయి.

ప్రస్తుతం గ్రూప్ మ్యాచ్ లు జరుగుతున్నాయి.

గ్రూప్ మ్యాచెస్ అనంతరం నాకౌట్ మ్యాచెస్ జరగనున్నాయి. డిసెంబర్ 18న ఫైనల్ జరగనుంది.

ఈ సారి ఫిఫా వరల్డ్ కప్ 2022 విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి.