మాస్ కా దాస్ అనిపించుకుంటున్న హీరో విశ్వక్ సేన్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

అయితే ఈ హీరోని యూత్‌కి దగ్గర చేసిన సినిమా మాత్రం 'ఈ నగరానికి ఏమైంది'.

తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది.

ఇక ఈ సినిమా.. మిమర్స్‌కి ఒక గైడ్ బుక్ లాంటింది.

అయితే ఈ మధ్య ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండడంతో.. 'ఈ నగరానికి ఏమైంది' సినిమాని కూడా రీ రిలీజ్ చేయమని ఆడియన్స్ నుంచి రిక్వెస్ట్‌లు వస్తున్నాయి.

తాజాగా దీనిపై హీరో విశ్వక్ సేన్ స్పందించి, తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టాడు.

రీ రిలీజ్ డేట్ త్వరలోనే చెబుతాను అంటూ 'ఈ నగరానికి ఏమైంది' ఫ్యాన్స్‌కి తెలియజేశాడు.