ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ప్రాజెక్ట్-K’.

మహానటి ఫేమ్ నాగ అశ్విన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోణె, దిశా పటాని వంటి బడా స్టార్స్ నటిస్తున్నారు.

తాజాగా ఈ మూవీలో మరో స్టార్ హీరో యాక్ట్ చేయబోతున్నాడు అంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

సీతారామం సినిమాతో తెలుగు వారికి దగ్గరైన దుల్కర్ సల్మాన్.. ప్రాజెక్ట్-K లో ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాడని సమాచారం.

ఈ పాత్ర సినిమాని మలుపు తిప్పేలా ఉండబోతుందట.

మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలి అంటే మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సిందే.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలోని ఫ్యూచరిస్టిక్ సెట్‌లో జరుగుతుంది.