ఈ సీక్రెట్స్ ఎవ్వరికీ చెప్పకండి..

అన్ని విషయాలను మనం దాచుకోవడం కష్టంగానే ఉంటుంది. అందుకని మనం కొన్ని విషయాలను మన ఫ్రెండ్స్ కి లేదా మనకు నమ్మకం ఉన్నవారితో చెప్పుకుంటాము. కానీ మనం అందరికీ చెప్పకూడని సీక్రెట్స్ కొన్ని ఉంటాయి. అలంటి సీక్రెట్స్ ని ఎవరికీ చెప్పకూడదు.

మనం ఎంత డబ్బు దాచుకున్నాము, ఎంత సంపాదిస్తున్నాము అన్న విషయం ఎవ్వరికీ చెప్పకూడదు.

కుటుంబంలో వచ్చే సమస్యలు, గొడవలు గురించి కూడా ఎక్కువగా ఎవ్వరికీ చెప్పకూడదు.

మీ జీవిత గమ్యం గురించి ఎవ్వరికీ ముందే చెప్పకూడదు.

ఎవరిని మనం ప్రేమిస్తున్నామో ఎంత ప్రేమిస్తున్నామో వేరే వాళ్లకి చెప్పకూడదు. మన పార్ట్నర్ గురించి, వారితో మనం ఎలా ఉంటామో కూడా వేరేవాళ్లకి చెప్పకూడదు.

మన పార్ట్నర్ తో మనం గడిపే రొమాంటిక్ జీవితం గురించి కూడా ఎవ్వరితో చెప్పకూడదు.

ఎవరైనా మనల్ని అవమానిస్తే ఆ విషయం గురించి మనం ఎవ్వరికీ చెప్పకూడదు.

మన వయసు గురించి కూడా ఎవ్వరికీ చెప్పకూడదు ఎప్పుడూ సీక్రెట్ గానే ఉంచాలి.

ప్రతి ఒక్కరికీ కొన్ని బలహీనతలు ఉంటాయి. వాటిని కూడా ఎవ్వరితో అస్సలు పంచుకోకూడదు.