కపిల్ దేవ్‌తో దివి.. స్పెషల్ పోస్ట్..

బిగ్‌బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న నటి దివి రెగ్యులర్‌గా బోల్డ్, ట్రెడిషినల్ ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది.

ప్రస్తుతం సినిమాలు, సిరీస్‌లతో బిజీగా ఉన్న దివి పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది.

తాజాగా రోటరీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల్లో దివి గెస్ట్‌గా పాల్గొంది.

ఈ కార్యక్రమానికి ఇండియన్ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా విచ్చేశారు.

దీంతో కపిల్ దేవ్‌తో దివి మాట్లాడటం, ఫోటోలు దిగడం, కపిల్ కి మెమెంటో బహుకరించడం చేసింది.

కపిల్ దేవ్‌తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అంతటి లెజెండ్‌ని కలిశాను అని ఫుల్ ఖుషి అయింది దివి.

కపిల్ దేవ్‌తో దివి ఫోటోలు దిగడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.