రామ్‌చరణ్, శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా RC15.

ఈ మూవీ తమ నిర్మాణంలో 50వ ప్రాజెక్ట్ కావడంతో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

ఈ నెల 27న చరణ్ బర్త్ డే ఉండడంతో, ఆ రోజు టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉంటుంది అంటూ కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.

బర్త్ డేకి టైటిల్ అనౌన్స్‌మెంట్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వస్తుంది అంటూ తెలియజేశాడు.

ఇక ఈ మూవీ రిలీజ్ గురించి మాట్లాడుతూ.. డిసెంబర్ నెలకి దాదాపు షూటింగ్ పూర్తి అవుతుంది.

డిసెంబర్ లేదా 2024 జనవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము.

రిలీజ్ డేట్ విషయం పూర్తిగా దర్శకుడి నిర్ణయం అంటూ వెల్లడించాడు.