దేశంలో వివిధచోట్ల సంక్రాంతి పండుగ పేర్లు..
సంక్రాంతి పండుగను దేశమంతా జరుపుకుంటారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో రకమైన పేర్లతో జరుపుకుంటారు.
ఒకే రకమైన పండుగను వేర్వేరు రకాలుగా మన దేశంలోని అన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు.
భారతదేశంలో పల్లె వాతావరణం అంటే ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం అనేవి సంక్రాంతి పండుగ రోజున మాత్రమే ఎక్కువగా కనబడతాయి.
మాఘీ లేదా లోహ్రీ అని మన ఉత్తర భారత దేశంలో సంక్రాంతి పండుగను పిలుస్తారు.
మాఘ్ బిహు అనే పేరుతో ఈశాన్య రాష్ట్రంలో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.
పశ్చిమ భారతదేశంలో ఉత్తరాయణ్ అనే పేరుతో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.
తమిళనాడులో పొంగల్ అని సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతి, మకర సంక్రాంతి అని జరుపుకుంటారు.