'వాల్తేరు వీరయ్య' ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై స్పందించాడు.

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా పవన్‌ని మూడు పెళ్లిళ్ల గురించి విమర్శిస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి అని అడిగిన ప్రశ్నకు చిరు బదులిచ్చాడు.

ఎవరు ఎలాంటి వారు అనేది ప్రజలకి బాగా తెలుసు. పవన్ వ్యక్తిత్వం గురించి తెలుసు కాబట్టే ఈరోజు ఇంతమంది తనని అభిమానిస్తున్నారు - చిరు

పొలిటికల్‌గా వాళ్ళు ఏమన్నా కామెంట్ చేసుకొనివండి. నేను వాటిపై స్పందించాను - చిరు

ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా. అలా అని నా తమ్ముడికి దూరంగా ఉంటున్నా అని కాదు - చిరు

వాడు నా తమ్ముడు. నాకు బిడ్డ లాంటి వాడు - చిరు

కాగా వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్ సీస్‌లో కూడా ఈ చిత్రం 2.25 మిలియన్స్ కలెక్షన్స్ సాధించింది.