టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మెగా వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

తన టాలెంట్‌తో స్టైలిష్ స్టార్‌గా, ఐకాన్ స్టార్‌గా, పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.

2003 మార్చి 28న రిలీజ్ అయిన గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ స్టార్ట్ అయ్యింది.

ఈ ఇయర్‌తో 20 ఏళ్ళు పూర్తి అవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులకు థాంక్యూ చెబుతూ ట్వీట్ వేశాడు.

ఇక చిరంజీవి అల్లు అర్జున్ 20 ఇయర్స్ జర్నీ గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్ వేశాడు.

నీ చైల్డ్‌హుడ్ మెమోరీస్ ఇంకా మైండ్‌లో రన్ అవుతూనే ఉన్నాయి.

ఈరోజు నువ్వు పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.

ఫ్యూచర్ డేస్‌లో నువ్వు మరింత ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు.