బాహుబలి-2 కలెక్షన్స్ విషయంలో టాలీవుడ్‌లో నెంబర్-1 పొజిషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్‌లో కూడా ఈ సినిమా.. హిందీ మూవీస్ వెనక్కి నెట్టి ఇండస్ట్రీ హిట్ ప్లేస్‌లో ఉంది.

బాహుబలి-2 2017లో రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచి హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద..

ఏ బాలీవుడ్ సినిమా బాహుబలి స్థానాన్ని తీసుకోలేక పోయింది.

దీంతో దాదాపు 5 ఏళ్ళ పాటు బాలీవుడ్‌లో.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచి రికార్డు సృష్టించింది. 

5 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఆ స్థానాన్ని షారుఖ్ ఖాన్ పఠాన్ దక్కించుకుంది.

బాహుబలి-2 హిందీ లైఫ్ టైం రన్‌లో 510 కోట్ల నెట్ షేర్ సాధించగా.. 

రీసెంట్‌గా పఠాన్ 510.65 నెట్ షేర్ సాధించి.. హిందీ బాహుబలి-2 కలెక్షన్స్‌ని క్రాస్ చేసింది.