పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పిరియాడిక‌ల్ మూవీ 'హరిహర వీరమల్లు'.

ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.

మొఘలుల కాలంనాటి కథాంశం కావడంతో, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర కోసం బాలీవుడ్ నటుడు రంగంలోకి దిగాడు.

బాలీవుడ్ స్టార్ హీరో ‘బాబీ డియోల్’ని చిత్ర యూనిట్ ఈ పాత్ర కోసం ఎంపిక చేసుకుంది.

ఇవాళ షూటింగ్‌లో జాయిన్ అవ్వడానికి హైదరాబాద్ వచ్చిన బాబీ డియోల్‌కి ఒక స్పెషల్ వీడియోతో వెల్‌కమ్ చెప్పింది మూవీ టీమ్.

17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్‌లో పవన్, డియోల్‌ పై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.

ఇటీవలే 900 మంది సిబ్బందితో 40 రోజుల పాటు కష్టపడి, కీలకమైన యాక్షన్ సన్నివేశాలు పూర్తీ చేశారు మేకర్స్.