జీలకర్ర ఆరోగ్యానికి ఊతకర్ర..

మనం రోజూ తినే వంటల్లో కచ్చితంగా జీలకర్ర వాడతాం.

జీలకర్ర రోజూ తినడం వల్ల రక్త హీనతని రానివ్వదు.

జీర్ణక్రియకు జీలకర్ర బాగా పని చేస్తుంది.

జీరా వాటర్ తాగితే జీర్ణాశయం శుభ్రమవుతుంది. కడుపులోని నులి పురుగులు చనిపోతాయి.

జీలకర్ర లేహ్యాన్ని ముఖానికి రాయడం వల్ల మొటిమలు తగ్గుతాయి.

జీలకర్ర ఆయిల్ కి, ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకి రాస్తే జుట్టు రాలకుండా ఉంటుంది.

జీలకర్ర రోజూ తీసుకుంటే మహిళలకు నెలసరి క్రమబద్ధంగా వస్తుంది.

మనలో రోగ నిరోధక శక్తి పెంచడానికి జీలకర్ర ఉపయోగపడుతుంది.

జీలకర్ర రోజూ తింటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి.

మంచిగా నిద్ర పట్టాలంటే జీలకర్ర నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.