తులసి ఆకులు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా??
తులసి చెట్టును మనం ఒక దేవత వృక్షంగా పూజిస్తాము. అందరి ఇళ్లలోనూ తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది, ఉండాలి. తులసి చెట్టు ఉండటం వల్ల ఇంట్లో కూడా అనేక లాభాలు ఉన్నాయి. ఇక తులసి ఆకులతో పూజలు కూడా చేస్తారు.
అలాగే తులసి ఆకులు ఒక ఔషధం కూడా. తులసి ఆకుల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.
తులసి చెట్ల మధ్య ఉండి రోజు ఆ గాలిని పీల్చినట్లైతే శ్వాసకి సంబంధిత, ఆస్తమా వంటి వ్యాధుల నుండి బయటపడవచ్చు.
తులసి ఆకులని కొన్నింటిని రోజూ తిన్నట్లైతే దగ్గు, జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది.
తులసి రసానికి కొద్దిగా తేనెను కలిపి రోజూ తీసుకుంటే అది మనలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
తులసి ఆకులను రోజూ తినడం వలన మూత్రపిండాల్లో రాళ్ళు కూడా కరుగుతాయి.
తులసి ఆకులను నీటిలో వేసుకొని రోజూ తాగితే అది మనలోని ఒత్తిడిని దూరం చేస్తుంది.
మధుమేహం, రక్త సంబంధ సమస్యలు కూడా తులసి ఆకులు రోజూ తినడం వలన తగ్గుతాయి.
నోటిలో అల్సర్లు లేదా పుండ్లు ఏమైనా ఉంటే తులసి ఆకులు నోట్లో ఉంచుకొని రసం వచ్చేలా చప్పరిస్తే వాటిని కూడా తులసి ఆకులు తగ్గిస్తాయి.