బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది.

ఒంగోలులో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు.

ఈ ఈవెంట్‌లో బాలయ్య తన డ్రీం ప్రాజెక్ట్ గురించి అభిమానులతో పంచుకున్నాడు.

'చెంఘీజ్ ఖాన్' పాత్రలో నటించాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

'ఆ సినిమా చేయడమే నా జీవిత ఆశయం' అంటూ తన మనసులోని మాట చెప్పాడు.

ఆ సినిమా ఎప్పటికైనా.. తప్పకుండా చేస్తా అంటూ వెల్లడించాడు.

గతంలో బాలకృష్ణ వారియర్‌గా కనిపిస్తూ చేసిన సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'.

త్వరలో ఈ మంగోలియన్ వీరుడి పాత్రలో కూడా కనిపించబోతున్నాడు.