తన తల్లి బసవతారకం కాన్సర్‌తో చనిపోయిందని, మరొకరు అలా చనిపోకూడదని..

నందమూరి బాలకృష్ణ బసవతారకం కాన్సర్‌ హాస్పిటల్ కట్టించి ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా మరో గొప్ప నిర్ణయం కూడా తీసుకున్నాడు బాలకృష్ణ.

ప్రస్తుతం బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపూర్‌లో ఓ హాస్పిటల్ కట్టిస్తున్నాడు. 

ఈ హాస్పిటల్‌లో ఒక బ్లాక్‌కి తారకరత్న పేరుని పెట్టాడు.

అంతేకాదు గుండె సమస్యలతో బాధ పడే వారికీ తారకరత్న పేరు మీద ఉచిత వైద్యం కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నాడు.

తారకరత్న పిల్లలు బాధ్యత తీసుకోవడమే కాకుండా, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడంతో..

అభిమానులతో పాటు అందరు అభినందిస్తున్నారు.