బాలయ్య నటిస్తున్న ఫ్యాక్షన్ డ్రామా చిత్రం 'వీరసింహారెడ్డి

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఒంగోలులో జరిగింది.

ఈ ఈవెంట్‌కి బాలయ్య హెలికాఫ్టర్‌లో ఒంగోలు చేరుకున్నాడు.

రాత్రి ఈవెంట్ ముగిసిన తరువాత ఒంగోలులోనే బస చేశాడు బాలకృష్ణ.

ఈరోజు ఉదయం హైదరాబాద్ తిరిగి హెలికాఫ్టర్‌లోనే బయలుదేరాడు.

టేక్ ఆఫ్ అయిన హెలికాఫ్టర్‌ 20 నిమిషాలకి మళ్ళీ ఒంగోలులో ల్యాండ్ అయ్యింది.

ఉదయం పొగ మంచు ఉండడంతో సరైన క్లియరెన్స్ లేకపోవడంతో.. పైలట్ అప్రమత్తమయ్యి ఒంగోలులోనే జాగ్రత్తగా ల్యాండ్ చేశాడు.  ఈ విషయం తెలియయడంతో బాలయ్య ఏమైనా అయ్యిందా? అని.. అభిమానులు కంగారు పడ్డారు.

ప్రెజెంట్ బాలయ్య సురక్షితంగానే ఉన్నాడు.