బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత కొస్తుంది.

మొదటిరోజే దాదాపు రూ.54 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది.

ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బాలకృష్ణ ఒక టీవీ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఈ ఇంటర్వ్యూలో బాలయ్య దేవాంగ కులాన్ని హేళన చేస్తూ మాట్లాడని ఏపీ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ఆరోపిస్తుంది.

దేవ బ్రాహ్మణులకు గురువు దేవళ మహర్షి అని, వారి నాయకుడు రావణాసురుడు అని బాలయ్య చరిత్రని వక్రీకరించినట్లు ఆరోపిస్తున్నారు.

దీనిపై ఏపీ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ స్పందిస్తూ.. దేవాంగుల కుల గురువు దేవళ మహర్షి, కులదైవం చౌడేశ్వరి దేవి అని. దేవాంగుల చరిత్ర బ్రహ్మాండ పురాణంలో రాయబడినట్లు తెలియజేశారు.

చరిత్ర తెలుసుకోకుండా బాలయ్య.. దేవాంగుల మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడాడు. తక్షణమే అయన ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలి అంటూ కోరారు.

అంతేకాదు బాలకృష్ణ దేవాంగ సమాజానికి క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.