బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లీని పెళ్లాడిన తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

ఆ తరువాత ఒక పాపకి జన్మనివ్వడంతో, నాలుగేళ్ళ నుంచి సినిమాలో కనిపించలేదు.

ఇటీవల అనుష్క ప్రొడ్యూస్ చేసిన 'ఖలా' అనే సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించి అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది.

మళ్ళీ రీ ఎంట్రీకి సిద్దమైన అనుష్క.. ఇండియన్ క్రికెటర్ బయోపిక్‌తో రాబోతుంది.

భారతీయ ఉమెన్స్ టీమ్ స్టార్ బౌలర్  ‘ఝులన్ గోస్వామి’ బయోపిక్‌లో అనుష్క నటిస్తుంది.

అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన గోస్వామి పాత్రలో అనుష్క కనిపించనుంది.

నిన్నటితో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

ఈ మూవీకి ‘చక్ దే ఎక్స్‌ప్రెస్’ అనే టైటిల్‌ని పెట్టారు.