గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న సినిమా డీజే టిల్లు.

ముఖ్యంగా ఈ సినిమాలో హీరో సిద్దు బాడీ లాంగ్వేజ్ అండ్ స్లాంగ్ కి ఆడియన్స్ ఫిదా అయ్యిపోయారు.

సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ తీసుకు వచ్చేందుకు మూవీ టీం రెడీ అయ్యింది.

టిల్లు స్క్వేర్ అంటూ సీక్వెల్‌ని ప్రకటించి, షూటింగ్ మొదలు పెట్టారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ని తీసుకున్నారు.

అయితే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా అండ్ వెబ్ సైట్స్‌లో కథనాలు వస్తున్నాయి. 

దీంతో మూవీ టీం అవన్నీ ఫేక్ న్యూస్ అని తెలియజేసేలా షూటింగ్ సెట్‌లోని ఒక వీడియో రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో అనుపమ, హీరో సిద్దు కర్లీ హెయిర్‌ని సరి చేస్తూ కనిపిస్తుంది.