తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ సుమ అంటే తెలియనివాళ్ళు ఎవరూ ఉండరు.

15 ఏళ్లుగా యాంకరింగ్ చేస్తూ, ఒక ట్రేడ్ మార్క్‌లా నిలిచింది.

టీవీ షోలు నుంచి సినిమా ఫంక్షన్‌లు వరకు ఏది జరిగినా అక్కడ సుమ ఉండాల్సిందే. 

తన పంచులతో, కామెడీ టైమింగ్‌తో ఇన్నాళ్లు అందర్నీ ఆకట్టుకుంది సుమ.

ఇప్పుడు యాంకరింగ్‌కి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించింది.

ఓ టీవీ ఛానల్‌లో న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రాంకి వచ్చిన సుమ.. ఈ విషయాన్ని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.

మలయాళీ అమ్మాయి అయిన నేను.. తెలుగు ప్రేక్షకుల ప్రేమతో ఇప్పుడు ఇంతటి స్థాయిలో ఉన్నా - సుమ

ఇక యాంకరింగ్‌కి బ్రేక్ ఇవ్వాలి అనుకుంటున్నా - సుమ