విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో టాలీవుడ్‌కి..

పరిచయమైన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే.

ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుందాం అనుకున్న ఈ అమ్మడి కలలు కలగానే మిగిలిపోయాయి.

ప్రస్తుతం బాలీవుడ్ ఈ ముద్దుగుమ్మ 3 సినిమాల్లో నటిస్తుంది.

కాగా అనన్య.. ఆషికి హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో ప్రేమలో ఉందంటూ..

గత కొంతకాలంగా బి-టౌన్‌లో టాక్ వినిపిస్తుంది.

తాజాగా జరిగిన ఒక ఫ్యాషన్ షోలో వీరిద్దరూ కలిసి ర్యాంప్ వాక్ చేశారు.

దీంతో వీరిద్దరి ప్రేమ వార్తలు నిజమంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.