ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'ప్రాజెక్ట్-K'.

ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం హైదరాబాద్ నగర శివారులో అమితాబ్ పై యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రీకరణలో అమితాబ్‌కి గాయం అవ్వడంతో, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.

పక్కటెముక కండరాలకు గాయమైనట్లు వైద్యులు గుర్తించి చికిత్స చేశారు.

కానీ అమితాబ్‌కి గాయం బాధిస్తుండం, శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉండటంతో.. 

వైద్యులు కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకోవాలంటూ సూచించారు.

దీంతో ప్రాజెక్ట్-K షూటింగ్‌కి బ్రేక్ పడింది.