అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే, తాజాగా ఆహా అల్లు అర్జున్ గురించి ఒక ట్వీట్ చేసింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని మీరు మాస్ గా చూసి ఉంటారు, క్లాస్ గా చూసి ఉంటారు.  ఈసారి ఒక బ్లాక్ బస్టర్ లుక్ తో మీ ముందుకి తీసుకోని రాబోతున్నాము.

బిగ్ అనౌన్స్‌మెంట్ వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.

దీంతో అల్లు అర్జున్ ఆహాలో కొత్త టాక్ షో చేయబోతున్నాడా? అనే సందేహం మొదలైంది.

అయితే కొంతమంది మాత్రం ఇది ఆహా కొత్త యాడ్ గురించి అని అంటున్నారు.

ఇటీవల త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్, శ్రీలీల పై యాడ్ చేసినట్లు ఒక ఫోటో బయటకి వచ్చింది.

మరి ఆ బిగ్ అనౌన్స్‌మెంట్ ఏంటనేది తెలియాలి అంటే ఆహా క్లారిటీ ఇవ్వాల్సిందే.