ఈ ఇయర్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్‌గా జరిగాయి.

మార్చి 27 నైట్ ఉపాసన చరణ్ బర్త్ డే పార్టీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది.

ఈ పార్టీకి అక్కినేని, దగ్గుబాటి అండ్ రాజమౌళి ఫ్యామిలీ మెంబెర్స్‌తో కలిపి ఇండస్ట్రీలోని స్టార్స్ అంతా వచ్చారు.

అయితే అల్లు కుటుంబం నుంచి మాత్రం అల్లు అరవింద్ ఒక్కడే వచ్చాడు.

అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా కూడా చరణ్‌కి బర్త్ డే విషెస్ చెప్పక పోవడంతో..

అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం మొదలైంది.

తాజాగా దీని పై అల్లు అర్జున్ టీం రియాక్ట్ అయ్యింది. బన్నీ, చరణ్‌కి వీడియో కాల్ ద్వారా విషెస్ చెప్పాడట.

పార్టీ రోజు బన్నీ తన కజిన్ బర్త్ డే పార్టీకి కచ్చితంగా వెళ్లాల్సి వచ్చి వియత్నాం వెళ్లాడని, చరణ్ సిస్టర్ కూడా బన్నీతో పాటు వెళ్లినట్లు తెలియజేశారు.