స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా మార్చేసిన మూవీ పుష్ప.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు. దీంతో పుష్ప-2 అప్డేట్ కోసమే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
తాజాగా పుష్ప-2 గురించి ఒక న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే.
ఆ రోజు పవర్ ఫుల్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారట.
మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు.
ఇక ఇటీవలే వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న బన్నీ.. ఫ్యామిలీ వెకేషన్‌కి వెళ్లి వచ్చాడు.