అల్లు అర్జున్ 'వరుడు' మూవీలో నటించిన భానుశ్రీ మెహ్రా అందరికి తెలిసే ఉంటుంది.

తాజాగా తనని అల్లు అర్జున్ బ్లాక్ చేశాడు అంటూ ట్వీట్ చేసింది.

నేను అల్లు అర్జున్‌తో కలిసి వరుడు సినిమా చేశాను. ఆ తరువాత నాకు పెద్దగా అవకాశాలు రాలేదు.

కానీ నేను నా ప్రయత్నం ఆపలేదు. ఈ క్రమంలో ఎన్నో సమస్యలు ఎదురుకున్నా. కాగా ఇప్పుడు నన్ను అల్లు అర్జున్ ట్విట్టర్‌లో బ్లాక్ చేశాడు అంటూ స్క్రీన్‌షాట్ షేర్ చేసింది.

ఇక భానుశ్రీ మెహ్రా ట్వీట్ చేసిన రెండు గంటలకు అల్లు అర్జున్ అన్‌బ్లాక్ చేశాడు.

ఈ విషయాన్ని భానుశ్రీ తెలియజేస్తూ.. నేను అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయాలని అనుకోవడం లేదు అంటూ రాసుకొచ్చింది.

అయితే అల్లు అర్జున్ బ్లాక్ చేయడానికి గల కారణం తెలియలేదు.

వరుడు సినిమా తరువాత భానుశ్రీ మెహ్రాకి పెద్దగా సినిమా అవకాశాలు కూడా రాలేదు.