ఆహా  డ్యాన్స్ ఐకాన్ ఫస్ట్ సీజన్  విన్నర్ ఇతనే..

తెలుగు ఓటీటీ ఆహాలో వరుసగా కొత్త సినిమాలు, సిరీస్ లతో పాటు కొత్త కొత్త షోలు కూడా వస్తున్నాయి.

కొన్ని రోజుల క్రితం ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సింగింగ్ రియాలిటీ షోని గ్రాండ్ గా సక్సెస్ చేయగా ఇటీవల డ్యాన్స్ ఐకాన్ అంటూ సరికొత్త డ్యాన్స్ షోతో వచ్చింది ఆహా.

రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ జడ్జీలుగా, మోనాల్ గజ్జర్, శ్రీముఖి, యష్ మాస్టర్ మెంటార్స్ గా, ఓంకార్ యాంకర్ గా ఈ షో బాగా పాపులర్ అయింది.

13 వారాల పాటు సాగిన ఈ షో తాజాగా ఫైనల్ ఎపిసోడ్ పూర్తయి సీజన్ ముగిసింది.

డాన్స్ ఐకాన్ ఫ‌స్ట్ సీజన్‌ విన్నర్స్‌గా కంటెస్టెంట్ ఆసిఫ్‌, కొరియోగ్రాఫర్ రాజు నిలిచారు.

షోలో విజేత‌గా నిలిచిన వీరికి విన్నర్ ట్రోఫీతో పాటు, 20 ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దు బహుమతి, కొరియోగ్రాఫర్ రాజుకి టాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరోకి కొరియోగ్ర‌ఫీ చేసే అవకాశం అందింది.