రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు వేడుకల్లో పాల్గొనేందుకు ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.

తాజాగా అక్కడ మోస్ట్ పాపులర్ 'గుడ్ మార్నింగ్ అమెరికా' టాక్ షోకు గెస్ట్‌గా వెళ్ళాడు.

ఈ టాక్ షోలో అమెరికన్ ఫేమస్ డాక్టర్ జెన్నిఫర్ ఆష్‌టన్ కూడా పాల్గొంది.

అయితే ఈ ఇంటర్వ్యూ తరువాత జెన్నిఫర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రామ్‌చరణ్‌ని ఫాలో కొట్టడమే కాకుండా..

చరణ్ ఫాలో అయ్యే వ్యక్తిలను కూడా ఫాలో కొట్టింది.

ఈ క్రమంలోనే చిరంజీవి, ఉపాసన, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక, శ్రీజ అండ్ సుస్మిత కొణిదల, రానా, శర్వానంద్, రాజమౌళి, సుకుమార్.. ఇంకొంతమందిని ఫాలో కొట్టింది.

చరణ్‌తో పాటు తను ఫాలో అయ్యే వ్యక్తిలను కూడా ఫాలో అవ్వడం స్టార్ట్ చేయడంతో..

రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు.