అదితిరావు హైదరీ, సిద్దార్థ్ డేటింగ్‌లో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల కాలంలో వీరిద్దరూ ఎక్కడ కనిపించిన జంటగా కనిపిస్తున్నారు.

శర్వానంద్ ఎంగేజ్మెంట్ వేడుకకు కూడా ఇద్దరు జంటగా వచ్చారు.

అయితే ఈ రూమర్స్ పై ఇప్పటి వరకు ఈ జంట ఎక్కడా స్పందించలేదు.

తాజాగా అదితి ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్స్ గురించి మాట్లాడింది.

జనాలు వాళ్ళకి ఏది కావాలని అనుకుంటారో, దాని గురించే మాట్లాడుకుంటారు. 

వారిని నేను ఆపలేను. కాబట్టి నాకు ఏది కావాలో నేను దానినే వెతుకుతూ వెళ్తాను. 

నా వరకు నాకు అంతా ఓకే అంటూ బదులిచ్చింది.