ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు ఆస్కార్‌ని గెలుచుకోలేక పోయినా పర్వాలేదు..
ఆ వేడుకల్లో రెడ్ కార్పెట్ పై ఒకసారైనా నడిస్తే చాలు అని ఫీల్ అవుతుంటారు.
రెడ్ కార్పెట్ పై మెరిసేందుకు ఆస్కార్ వచ్చేవారు ప్రత్యేక డిజైన్ వేర్ డ్రెస్సులతో రెడీ అవుతుంటారు.
అయితే ఈ ఏడాది ఆస్కార్ వేడుకలో రెడ్ కార్పెట్ కాకుండా షాంపైన్ కలర్ కార్పెట్ ఉపయోగించబోతున్నారు.
ఇందుకు గల కారణం ఏంటనేది అకాడమీ తెలియజేయలేదు.
1961లో మొదటిసారి ఆస్కార్ వేడుకల్లో రెడ్ కార్పెట్‌తో తరాలకు ఆహ్వానం పలికారు.
లాస్ట్ ఇయర్ వరకు ఈ ట్రెడిషన్‌ని ఫాలో అవుతూ వచ్చారు.
కానీ ఈ ఏడాది 62 ఏళ్ళ ట్రెడిషన్‌ని బ్రేక్ చేస్తూ షాంపైన్ కలర్ కార్పెట్‌తో తరాలకు ఆహ్వానం పలుకుతున్నారు.