ఈ ఏడాది ఆస్కార్ పురస్కారం పై ఇండియన్ ఆడియన్స్‌లో చాలా ఆసక్తి నెలకుంది.
రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ కోసం పోటీ పడుతోంది.
ఇప్పటికే ఈ సాంగ్ పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుంది.
ముఖ్యంగా ఆస్కార్ తరువాత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా అందుకుంది.
దీంతో నాటు నాటు ఆస్కార్ కూడా అందుకుంటుందా? లేదా? అని అందరిలో ఆసక్తి నెలకుంది.
ఈ ఆసక్తిని గమనించిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. ఈ అవార్డుల వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సిద్దమయ్యింది.
ఇండియన్ టైం ప్రకారం మార్చి 13న ఉదయం గం.5:30 నుంచి లైవ్ టెలికాస్ట్ చేస్తున్నట్లు అధికారికంగా తెలియజేసింది.