ట్రాన్స్ జెండర్‌తో పెళ్లి.. ఆపై గొడవలు.. చివరకు

ఇటీవల కాలంలో ప్రేమకు హద్దు లేనట్లే.. పెళ్లికి కూడా లింగ బేధం లేకుండా పోయింది. ఆడవాళ్లను ఆడవాళ్లు పెళ్లి చేసుకోవడం, ఇద్దరు మగవాళ్లు ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లిళ్లు చేసుకోవడం ఇటీవల కాలంలో చూశాం.

Kaburulu

Kaburulu Desk

March 28, 2024 | 03:20 PM

ట్రాన్స్ జెండర్‌తో పెళ్లి.. ఆపై గొడవలు.. చివరకు

ఇటీవల కాలంలో ప్రేమకు హద్దు లేనట్లే.. పెళ్లికి కూడా లింగ బేధం లేకుండా పోయింది. ఆడవాళ్లను ఆడవాళ్లు పెళ్లి చేసుకోవడం, ఇద్దరు మగవాళ్లు ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లిళ్లు చేసుకోవడం ఇటీవల కాలంలో చూశాం. ఎందువల్లో తెలియదు ఈ రకమైన పెళ్లిళ్లను ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ట్రాన్స్ జెండర్ల పెళ్లిళ్ల గురించి కూడా కథలు కథలుగా చదివాం. అయితే ఓ వ్యక్తి.. ట్రాన్స్ జెండర్ ను వివాహం చేసుకుని వార్తల్లో నిలిచి.. ఇప్పుడు ఆమె వల్లే మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటకు చెందిన ధారావత్ శివరాం, జల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్‌ కొర్ర ప్రవీణ్ అలియాస్ తపస్విని వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఈ పెళ్లి చర్చనీయాంశం కూడా అయ్యింది. అయితే కొన్నేళ్ల కాపురం తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో విడిపోయారు. శివరాం మరో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. ట్రాన్స్ జెండర్ తపస్వి అడ్డుకుంటోంది. దీంతో అతడు మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె వేధింపులు తట్టుకోలేకే తన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.