Akkineni Amala : అందుకే సినిమాలు ఒప్పుకోవట్లేదు.. నాగార్జునతో మళ్ళీ సినిమా చేయను

Akkineni Amala : శర్వానంద్ హీరోగా అమల ముఖ్యపాత్రలో ఒకేఒక జీవితం సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. టైం ట్రావెల్ నేపథ్యంలో అమ్మ సెంటిమెంట్ ని జతచేసి అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, సెలబ్రిటీలు అంతా అమలని అభినందిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి సినిమాలో మంచి పాత్ర చేసి అందర్నీ మెప్పించింది అమల. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో అమల మాట్లాడుతూ ఆసక్తికర విషయాలని తెలిపింది.
ప్రెస్ మీట్ లో సినిమాలు రెగ్యులర్ ఎందుకు చేయట్లేదు అని అడగగా అమల మాట్లాడుతూ.. తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తర్వాత ఒకేఒక జీవితం సినిమానే చేశాను. ఈ గ్యాప్ లో మలయాళం లో రెండు, హిందీలో మూడు సినిమాలు చేశాను. గత అయిదేళ్లుగా అన్నపూర్ణ ఫిలిం&మీడియాని నేనే చూసుకుంటున్నాను. వందల మంది విద్యార్థుల భవిష్యత్తు భాద్యత నాపై ఉంది. అలాంటి బాధ్యత పెట్టుకొని నేను సినిమాలతో బిజీగా ఉండలేను. అందుకే నేను సినిమాలు చేయట్లేదు. ఎప్పుడైనా ఇలాంటి మనసుకి హత్తుకునే కథ, పాత్ర వస్తే ఒప్పుకుంటున్నాను” అని తెలిపింది.
Alia Bhatt : సినిమాలో పాజిటివ్ అంశాలని చూడండి.. బ్రహ్మాస్త్ర బాగా ఆడుతుంది..
భవిష్యత్తులో నాగార్జునతో కలిసి నటిస్తారా అని అడగగా.. ”ఇప్పటికే రోజూ నాగార్జునతో ఇంట్లో కలిసి ఉంటున్నాను. మళ్ళీ స్క్రీన్ మీద కూడా ఎందుకు. నాగ్ తో మళ్ళీ సినిమా చేయను” అని సరదాగా చెప్పింది.