Sunitha Tati : ప్రతి వారం బాహుబలి రాదు.. మన దగ్గర కథల కొరత ఉంది..

Kaburulu

Kaburulu Desk

September 7, 2022 | 12:43 PM

Sunitha Tati : ప్రతి వారం బాహుబలి రాదు.. మన దగ్గర కథల కొరత ఉంది..

Sunitha Tati :  రెజీనా, నివేదా థామస్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా శాకిని డాకిని. కొరియన్ సినిమా మిడ్ నైట్ రన్నర్స్ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. సుధీరవర్మ ఈ సినిమాని తెరకెక్కించగా, సునీత తాటి నిర్మించగా, సురేష్ బాబు రిలీజ్ చేస్తున్నారు. శాకిని డాకిని సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

ఇప్పటికే శాకిని డాకిని సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఓ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత సునీత తాటి మాట్లాడుతూ.. ”మన దగ్గర కథల కొరత చాలా ఉంది. అలాగే ఇక్కడ రచయితలకి కథ రాయడంలో ఫ్రీడమ్ లేదు. హీరోలని, మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని రాయాల్సి వస్తుంది. వేరే భాష సినిమాలని రీమేక్ చేస్తున్నాం. వేరే సినిమాలని రీమేక్ చేసినా వాటి సోల్ మిస్ అవ్వకుండా ఇక్కడి నేటివిటీకి తగ్గట్టు తీయడం అంత ఈజీ కాదు. రాజమౌళి బాహుబలి సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చారు. అలా అని ప్రతి వారం బాహుబలి రాదు” అని అన్నారు. దీంతో ఈమె చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి.