SSMB28 : మహేష్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలు.. వైరల్ అవుతున్న షూట్ పిక్..

Kaburulu

Kaburulu Desk

September 12, 2022 | 12:52 PM

SSMB28 : మహేష్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలు.. వైరల్ అవుతున్న షూట్ పిక్..

SSMB28 : మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో గతంలో అతడు, ఖలేజా విసినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. అతడు సినిమా నేటికీ ఒక క్లాసిక్ గా మిగిలి ప్రేక్షకులని అలరిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా రావాలని అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా కోరుకున్నారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమాని ప్రకటించారు.

మహేష్ బాబు హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని నిర్మాణ సంస్థలో SSMB28 సినిమాని అనౌన్స్ చేశారు. సినిమా అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా, ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరిగినా షూటింగ్ మాత్రం మొదలుపెట్టట్లేదు. ఇటీవల చిత్రయూనిట్ ఆగస్టులో SSMB28 సినిమా షూట్ మొదలుపెడతామని, 2023 సమ్మర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆగస్టు అయిపోయినా షూటింగ్ మాత్రం మొదలుపెట్టలేదు. దీంతో ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందారు.

VJ Sunny : బిగ్‌బాస్ నాకు ఉపయోగపడలేదు.. సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ సంచలన వ్యాఖ్యలు..

తాజాగా SSMB28 సినిమా షూటింగ్ సైలెంట్ గా మొదలుపెట్టేశారు. నేడు సోమవారం అధికారికంగా ఈ సినిమా షూటింగ్ ని మొదలుపెట్టారు. షూటింగ్ సెట్ లో త్రివిక్రమ్ మహేష్ కి సీన్ వివరిస్తున్న ఫోటోని తీసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. అభిమానులు సంతోషిస్తూ త్వరగా ఈ సినిమా పూర్తిచేసి రిలీజ్ చేయాలని అంటున్నారు.