ChaySam : చైసామ్ రిసెప్షన్ ఫోటోలు.. ఒకప్పటి కథ.. అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సమంత ఫాదర్..

Kaburulu

Kaburulu Desk

September 6, 2022 | 01:10 PM

ChaySam : చైసామ్ రిసెప్షన్ ఫోటోలు.. ఒకప్పటి కథ.. అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సమంత ఫాదర్..

 

ChaySam :  నాగచైతన్య, సమంత విడిపోయి నెలలు గడుస్తున్నా జనాలు మాత్రం వాళ్ళ గురించి రోజూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఏదో ఒకరకంగా వారిద్దరి పేర్లు మీడియాలో, సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. కొంతమంది వాళ్ళకి సపోర్ట్ గా పోస్టులు చేస్తుంటే, కొంతమంది వాళ్లపై ట్రోల్స్, గాసిప్స్ పోస్ట్ చేస్తున్నారు. తాజాగా మరోసారి చైసామ్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

చైసామ్ మరోసారి వైరల్ అవ్వడానికి కారణం సమంత తండ్రి జోసెఫ్ ప్రభు చేసిన ఓ పోస్ట్. సమంత తండ్రి తన ఫేస్‌‌బుక్ లో గతంలో పోస్ట్ చేసిన సమంత, చైతు రిసెప్షన్ ఫొటోలని షేర్ చేసి.. ఒకప్పుడు ఒక కథ ఉండేది, ఇప్పుడు అది లేదు, కాబట్టి కొత్త జీవితం, కొత్త అధ్యాయం మొదలుపెట్టాలి అంటూ పోస్ట్ చేశారు. దీంతో సమంత చైతన్యల విషయం అయిపోయిందని, వాటి గురించి మర్చిపోయి కొత్త జీవితం జీవించాలని అన్నట్టు పోస్ట్ చేశారు సమంత తండ్రి.

సమంత తండ్రి చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి దీనిపై సమంత, చైతన్య స్పందించకపోయినా అభిమానులు, నెటిజన్లు మాత్రం మళ్ళీ చై సామ్ గూర్చి చర్చిస్తున్నారు.