Krishnam Raju : రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత.. విషాదంలో టాలీవుడ్..

Kaburulu

Kaburulu Desk

September 11, 2022 | 03:44 AM

Krishnam Raju : రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత.. విషాదంలో టాలీవుడ్..

Rebel Star Krishnam Raju :  ఎన్నో గొప్ప సినిమాలని తెలుగు ప్రేక్షకులకి అందించిన నటుడు, రెబల్ స్టార్, రాజకీయ వేత్త, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు హఠాత్తుగా మరణించారు. 1940 జనవరి 20న జన్మించిన ఉప్పలపాటి కృష్ణంరాజు 1966లో చిలకాగోరింక సినిమాతో తెలుగు ప్రజలని మొదటిసారి పలకరించారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి రెబల్ స్టార్ గా ఎదిగారు.

నటుడిగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఆయన కేంద్రమంత్రిగా కూడా సేవలందించారు. తన వారసుడిగా తమ్ముడి కొడుకు అయిన ప్రభాస్ ని సినిమాల్లోకి తీసుకొచ్చి ప్రభాస్ విజయాల్ని చూసి పొంగిపోయారు కృష్ణంరాజు.

గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు గచ్చిబౌలి AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. నేడు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషాలకి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కృష్ణంరాజు మరణించారు. కృష్ణంరాజు మరణవార్త విని టాలీవుడ్ షాక్ కి గురయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ సంతాపం తెలుపుతున్నారు. కృష్ణంరాజు మరణం ప్రభాస్ కి, తెలుగు సినీ పరిశ్రమకి తీరని లోటు.