Ram Charan : సంక్రాంతికి RC15 టైటిల్ గ్లింప్స్ రానుందా?

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తాజా చిత్రం తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. RC15 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ లేటు అవుతూ వస్తుంది. కమల్ హాసన్ భారతీయుడు-2ని కూడా శంకర్ ఏకకాలంలో తెరకెక్కిస్తుండడంతో చరణ్ మూవీకి మధ్య మధ్యలో బ్రేక్‌లు వేస్తుంది.
Ram Charan :రామ్‌చరణ్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్?
ఇక సినిమా మొదలుపెట్టి చాలా రోజులు అయినా, చిత్ర యూనిట్ ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో దర్శకనిర్మాతలుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు చరణ్ అభిమానులు. దీంతో మూవీ టీమ్ ఫ్యాన్స్ కి ఒక సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సంక్రాంతి పండక్కి సినిమా టైటిల్ అండ్ చిన్న గ్లింప్స్ ని విడుదల చేయడానికి సిద్దమైందట మూవీ టీమ్.
ఈ టైటిల్ గ్లింప్స్ కి థమన్ మాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సిద్ధం చేసే పనిలో పడ్డాడు అంటా. అయితే ఈ వార్తపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఒకవేళ ఇదే నిజమైతే చరణ్ అభిమానులకు పండగే అని చెప్పాలి. కాగా ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్ జె సూర్య, అంజలి, సునీల్ వంటి తారలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.