Pawan Kalyan Fans : పవన్ కళ్యాణ్ బర్త్ డే.. అభిమానుల అత్యుత్సాహం.. థియేటర్స్ ధ్వంసం..

Kaburulu

Kaburulu Desk

September 2, 2022 | 01:24 PM

Pawan Kalyan Fans : పవన్ కళ్యాణ్ బర్త్ డే.. అభిమానుల అత్యుత్సాహం.. థియేటర్స్ ధ్వంసం..

Pawan Kalyan Fans :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో, రాజకీయ నాయకుల్లో ఒకరు. ఆయన ఒక్క మాట చెప్తే చాలు అభిమానులు కదం తొక్కుతారు. పవన్ సభ పెట్టినా, యాత్ర చేసినా అభిమానులు లక్షల్లో కదిలి వస్తారు. అయన సినిమాలు మాత్రమే కాక ఆయన వ్యక్తిత్వం చూసి అభిమానులు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పవన్ అభిమానులు కూడా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ మంచి పనులు చేస్తుంటారు.

అయితే కొంతమంది అభిమానులు మాత్రం పవన్ కి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తారు. అభిమానం శృతిమించి నష్టం కలిగే పనులు చేస్తుంటారు. వారి వల్ల పవన్ కి కూడా చెడ్డ పేరు వస్తుంది. తాజాగా నేడు పవన్ పుట్టిన రోజు కావడంతో పలు థియేటర్స్ లో తమ్ముడు, జల్సా సినిమాలని స్పెషల్ షోలు వేశారు. అభిమానులు ఈ స్పెషల్ షోలు చూడటానికి భారీగా తరలివచ్చారు. థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ చేశారు.

ఈ నేపథ్యంలో కర్నూల్ శ్రీరామ థియేటర్, వైజాగ్ లీలామహల్ థియేటర్లలో పవన్ అభిమానులు అత్యుత్సాహం చూపించారు. అభిమానం హద్దులు దాటి థియేటర్ ధ్వంసానికి దారితీసింది. సినిమా చూసి ఎంజాయ్ చేయకుండా కొంతమంది అక్కడ కుర్చీలు, సీలింగ్ విరగ్గొట్టడం, తెర చింపేయడం, మందు బాటిల్స్ తో వచ్చి థియేటర్స్ లో రచ్చ చేయడం చేశారు. దీనివల్ల థియేటర్ బాగా ధ్వంసం అయింది. షో అయిన తర్వాత చూసుకుంటే థియేటర్ అంతా ధ్వంసం అయి ఉంది. వైజాగ్ లీలామహల్ థియేటర్ యజమాని పవన్ ఫ్యాన్స్ వల్ల దాదాపు 20 లక్షల నష్టం వాటిల్లిందని వాపోయాడు. థియేటర్ ధ్వంసం అయిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అలాంటి అభిమానుల వల్లే పవన్ కి చెడ్డ పేరు వస్తుందని మిగిలిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.