Chiranjeevi : హీరోల డేట్లు ఉన్నాయని హడావిడిగా సినిమాలు తీయకండి అంటూ.. డైరెక్టర్లకు ‘చిరు’ క్లాస్..

Kaburulu

Kaburulu Desk

September 1, 2022 | 10:55 AM

Chiranjeevi : హీరోల డేట్లు ఉన్నాయని హడావిడిగా సినిమాలు తీయకండి అంటూ.. డైరెక్టర్లకు ‘చిరు’ క్లాస్..

Chiranjeevi :  ఇటీవల మన టాలీవుడ్ లో కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం, హిట్ సినిమాలకి కూడా కలెక్షన్లు లేకపోవడం, థియేటర్లకు జనాలు రాకపోవడం చూస్తున్నాము. దీనిపై సినీ వర్గాలు గగ్గోలు పెడుతూ దీనికి పరిష్కారం చూడాలంటూ మీటింగుల మీద మీటింగులు పెట్టారు. ఇక సినిమాల విషయంలో మెగాస్టార్ కొన్ని రోజుల క్రితమే డైరెక్టర్స్ అప్పటికప్పుడు డైలాగులు రాస్తున్నారంటూ ఇండైరెక్ట్ గా క్లాస్ పీకారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్స్ కి సలహాలిస్తునే ఇండైరెక్ట్ గా మరోసారి క్లాస్ పీకారు. బుధవారం సాయంత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో అనే ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా విచ్చేశారు చిరంజీవి. ఈ ఈవెంట్ లో సినిమాల గురించి, కథల గురించి, సినీ సమస్యల గురించి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ”ఇటీవల కొంతమంది సినిమాలకు జనాలు రావట్లేదు, సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అన్నారు. మంచి కంటెంట్ ఉంటే థియేటర్లకు జనాలు వస్తారు. రీసెంట్ గా వచ్చిన బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలే ఇందుకు నిదర్శనం. మంచి కథలు ఉండాలి. కథ, కథనం బాగోకపోతే సినిమా రెండో రోజే వెళ్ళిపోతుంది. ఇటీవల నా సినిమాకి కూడా అదే జరిగింది. ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు కథల మీద దృష్టి పెట్టాలి. ఆర్టిస్టులు, హీరోల డేట్స్ దొరికాయి కదా అని, ఏదో ఒకలా సినిమా తీసేద్దాం అంటే కుదరదు. డైరెక్టర్లు హడావిడిగా సినిమా తీయకండి. లేట్ అయినా పర్లేదు. కథ, కథనం బాగుండేలా ప్రేక్షకులని థియేటర్లకు రప్పించేలా రాసుకోండి. కొత్త కొత్త కథలతో రండి, కంటెంట్ ఉంటే కచ్చితంగా ప్రేక్షకులు సినిమాకి వస్తారు” అంటూ డైరెక్టర్స్ కి ఇండైరెక్ట్ గా క్లాస్ పీకారు. దీంతో చిరు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చగా మారాయి.