Krishnam Raju Last Rites : మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు.. అధికారలాంఛనాలతో..

Kaburulu

Kaburulu Desk

September 12, 2022 | 12:33 PM

Krishnam Raju Last Rites : మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు.. అధికారలాంఛనాలతో..

 

Krishnam Raju Last Rites :  రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం ఉదయం అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం టాలీవుడ్ కి, ప్రభాస్ కి తీరని లోటు మిగిల్చింది. నేడు సోమవారం సాయంత్రం మొయినాబాద్ లోని ఆయన సొంత ఫామ్ హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి.

Krishnam Raju : రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత.. విషాదంలో టాలీవుడ్..

సోమవారం మధ్యాహ్నం వరకు కృష్ణంరాజు పార్థివదేహాన్ని అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం అయన ఇంటివద్దే ఉంచారు. మధ్యాహ్నం కృష్ణంరాజు పార్థివ దేహాన్ని ఇంటి నుంచి మొయినాబాద్ కి అంతిమయాత్రగా తరలించారు. కృష్ణంరాజుకి మగపిల్లలు లేకపోవడంతో ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపించారు. రెబల్ స్టార్ ని చివరి చూపు చూడటానికి అభిమానులు, ప్రముఖులు తరలివచ్చారు. అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు కొద్దిసేపటిక్రితమే ముగిశాయి.