Comedian Soori : స్టార్ కమెడియన్ హోటల్స్ పై ఐటీ దాడులు..

Kaburulu

Kaburulu Desk

September 22, 2022 | 09:12 AM

Comedian Soori : స్టార్ కమెడియన్ హోటల్స్ పై ఐటీ దాడులు..

Comedian Soori :  పలు సినిమాలతో స్టార్ కమెడియన్ గా ఎదిగారు తమిళ్ యాక్టర్ సూరి. డబ్బింగ్ సినిమాలతో తెలుగు వాళ్లకి కూడా పరిచయమయ్యాడు. అందరు యాక్టర్స్ లాగే సినిమాల్లో సంపాదించాక సూరి బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టాడు. మధురైలో అమ్మన్ పేరుతో కొన్ని హోటల్స్ ని నిర్వహిస్తున్నారు సూరి. అమ్మన్ హోటల్స్ కి ఇతర హోటళ్ల కంటే తక్కువ ధరకే మంచి ఫుడ్ అందిస్తారని పేరు ఉంది.

Chiranjeevi : వైరల్ అవుతున్న చిరంజీవి ట్వీట్.. ‘రాజకీయానికి నేను దూరంగా ఉన్నాను.. నా నుంచి రాజకీయం దూరం కాలేదు’

అయితే సూరి హోటల్స్ మీద ఇతర హోటళ్ల నిర్వాహకులు ఐటీ అధికారులకి ఫిర్యాదు చేశారు. దీంతో మధురైలోని సూరి అమ్మన్ హోటల్స్ పై ఐటీ శాఖ దాడులు చేసింది. ఈ దాడుల్లో హోటల్స్ కి సంబంధించి అన్ని వివరాలని సేకరించారు. ఈ తనిఖీలలో సూరి జీఎస్టీ కట్టలేదని తేలింది. దీంతో ఐటీ శాఖ సూరి హోటల్స్ కి నోటీసులు జారీ చేశారు. అయితే దీనిపై ఇప్పటివరకు సూరి స్పందించలేదు. కమెడియన్ సూరి హోటల్స్ పై ఐటీ దాడులు కోలీవుడ్ లో చర్చగా మారాయి.