VJ Sunny : బిగ్‌బాస్ నాకు ఉపయోగపడలేదు.. సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ సంచలన వ్యాఖ్యలు..

Kaburulu

Kaburulu Desk

September 10, 2022 | 01:48 PM

VJ Sunny : బిగ్‌బాస్ నాకు ఉపయోగపడలేదు.. సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ సంచలన వ్యాఖ్యలు..

VJ Sunny :  బిగ్‌బాస్ షో కి వెళ్లాలని చాలా మంది సెలబ్రిటీలు, ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తున్న వాళ్లంతా అనుకుంటారు. బిగ్‌బాస్ లోకి వెళ్తే డబ్బులు, ఫేమ్ సంపాదించొచ్చు అని ఆశిస్తారు. వాళ్ళు అనుకున్నట్టే బిగ్‌బాస్ లోకి వెళ్తే డబ్బులతో పాటు ఫేమ్ కూడా వస్తుంది. బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక ఆ ఫేమ్ తో కొన్నాళ్ళు హడావిడి చేస్తారు. అయితే బిగ్‌బాస్ తో ఫేమ్, డబ్బులు వచ్చినా సినిమా అవకాశాలు మాత్రం వస్తాయో, రావో చెప్పలేరు.

బిగ్‌బాస్ కి వెళ్లే చాలా మంది తమ కెరీర్ ట్రాక్ లో పెట్టుకోవడానికి, అవకాశాలు రప్పించుకోవడానికి బిగ్‌బాస్ ఉపయోగపడుతుందేమో అని వెళ్తారు. కానీ చాలా మంది బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కొన్ని రోజులు హడావిడి చేసినా ఆ తర్వాత కనపడకుండా పోతారు. తాజాగా బిగ్‌బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ బిగ్‌బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Ishaan Khattar : లైగర్ బ్యూటీతో విడిపోయాను అంటున్న బాలీవుడ్ హీరో

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ మాట్లాడుతూ..”నేను బిగ్‌బాస్ విన్నర్ అని చెప్పుకోవడం మానేశాను. కొంతమందిని కలిసినప్పుడు నేను బిగ్‌బాస్ విన్నర్ అని చెప్తుంటే అంటే ఏంటి అని అడుగుతున్నారు. బిగ్‌బాస్ వల్ల నాకు ఫేమ్ వచ్చింది, అది ఒప్పుకుంటాను. కానీ బిగ్‌బాస్ నా కెరీర్ కి మాత్రం ఉపయోగపడలేదు. దానివల్ల నాకు అవకాశాలు ఏమి రాలేదు. అందుకే నేను బిగ్‌బాస్ విన్నర్ అని చెప్పుకోవడం మానేసి నా సినిమాలు, సీరియల్స్ కెరీర్ మీద దృష్టి పెట్టాను” అని అన్నాడు. దీంతో సన్నీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.