Bananas : అరటి పండ్లు వంకరగా, పైకే ఎందుకు పెరుగుతాయో తెలుసా..?

అన్ని పండ్లు కిందకి వేలాడేలా పెరుగుతాయి. కానీ అరటిపండ్లు మాత్రమే వంకరగా పైకి వేలాడుతూ పెరుగుతాయి. ఎందుకో ఆలోచించారా?..................

Kaburulu

Kaburulu Desk

January 30, 2023 | 07:07 PM

Bananas : అరటి పండ్లు వంకరగా, పైకే ఎందుకు పెరుగుతాయో తెలుసా..?

Bananas :  అరటిపండ్లు మనకు విరివిగా మరియు చాలా తక్కువ ధరకే, అన్ని కాలాల్లోనూ దొరికే పండ్లు. వీటిని అందరూ ఎక్కువగా తింటారు. కొంతమంది డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఆహారానికి బదులుగా అరటి పండ్లను మాత్రమే తిని కడుపు నింపుకుంటారు. ఇవి జీర్ణక్రియ కూడా మెరుగుపడేలా చేస్తుంది. కాబట్టి డాక్టర్లు కూడా తినమని సలహా ఇస్తుంటారు. అయితే అన్ని పండ్లు కిందకి వేలాడేలా పెరుగుతాయి. కానీ అరటిపండ్లు మాత్రమే వంకరగా పైకి వేలాడుతూ పెరుగుతాయి. ఎందుకో ఆలోచించారా?

అరటి పండ్లు చెట్లకు పెరుగుతాయి. అయితే వాటి కంటే ముందు అరటి చెట్టుకు పువ్వు వస్తుంది. ఆ పువ్వు రేకల కింద నుండి అరటి పండ్ల వరసలు అనేవి పెరుగుతాయి. ఈ క్రమంలో నెగిటివ్ జియోట్రాపిజం అనే ప్రక్రియ జరుగుతుంది. మామూలుగా అన్ని పండ్లు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి లోనయ్యి భూమి వైపుగా పెరుగుతాయి. కానీ అరటిపండ్లు ఈ శక్తికి లొంగవు కాబట్టి అవి సూర్యుని వైపుగా పెరుగుతాయి. అయితే ఇలా సూర్యుని వైపుగా పెరిగే క్రమంలోనే అరటి చెట్టు ఆకులు అడ్డుగా ఉండడం వలన సూర్యకాంతి కోసం అరటిపండ్లు వంగడం వలన అవి వంకరగా తయారవుతాయి. ఈ విధంగా మొత్తం అరటిపండ్లు తయారయ్యే సరికి వంకరగా తయారవుతాయి.

They Call Him OG : పవన్ – సుజీత్ సినిమా పూజా కార్యక్రమం గ్యాలరీ..

మన భారతదేశంలో అరటిచెట్లను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. అరటి చెట్టులోని ప్రతి భాగం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అరటి ఆకులలో భోజనం చేస్తారు, దీని వలన భోజనంలో ఏమైనా విష పదార్థాలు ఉంటే ఆకు రంగు మారుతుంది. అరటి కాండాన్ని ఆవులకు ఆహరం రూపంలో పెడతారు. అరటి పండ్లను నైవేద్యం గాను, తాంబూలాలు ఇవ్వడానికి ఉపయోగిస్తారు. అరటి కాండం మధ్యలో మొవ్వ ఉంటుంది. ఇది తెల్లగా మరియు తియ్యగా ఉంటుంది. దీనిని కూడా తినవచ్చు ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి అరటి చెట్టులోని ప్రతి భాగాన్ని మనం ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తూ ఉంటాము. అరటి పండ్లను మన ఆహరంలో భాగంగా చేసుకోవాలి. ఇది అన్నిరకాలుగా మనకి చాలా మంచి చేస్తుంది.